Thursday, May 2, 2024

చిన్నారికి అరుదైన లాటరీ.. రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఉచితం

జీవితంలో ఎప్పుడు అదృష్టలక్ష్మీ తలుపుతడుతుందో చెప్పడం చాలా కష్టం. కానీ ఓ చిన్నారికి చిన్న వయసులోనే బంపర్ లాటరీ తగిలింది. నాసిక్‌లోని శివరాజ్ దావరే అనే చిన్నారి అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. కాగా ఆస్పత్రిలో చూపిస్తే చిన్నారికి అరుదైన జన్యు పరమైన వ్యాధి సోకిందని చికిత్సకు కోట్లలో ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. కానీ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆ చిన్నారి తల్లి దండ్రులకు డాక్టర్ల మాటలు వినే సరికి ఒక్కసారిగా గుండెలు జారిపోయాయి. ఎలాగైనా సరే తమ చిన్నారిని బతికించుకోవాలనే పట్టుదల మాత్రం వారిలో కొండంత ఉంది. కానీ చికిత్సకు అవసరమైన డబ్బులు మాత్రం చేతిలో లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక విధినే నమ్ముకున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో అనుకోని అదృష్టం వారి తలుపుతట్టింది. చిన్నారికి ఉన్న వ్యాధి చికిత్సకు అవసరమైన దాదాపు 16 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్​ లాటరీలో ఉచితంగా లభించడం విశేషం. ఇలా అనుకోకుండా వచ్చిన లాటరీతో చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా ఓ డాక్టర్​ అమెరికాకు చెందిన ఓ సంస్థ చికిత్సకు అవసరమైన మందును ఉచితంగా లాటరీ ద్వారా అందజేస్తుందని అప్లై చేసుకోవాలని తెలిపాడు. అలా దరఖాస్తు చేసుకున్న ఆ తండ్రికి కొన్ని రోజుల్లోనే నమ్మశక్యం కాని రీతిలో ఇంజెక్షన్​ లాటరీలో వచ్చింది. దాదాపు 16 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్​ ఉచితంగా లభించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ వార్త కూడా చదవండి: ఆవు లేగదూడకు ఘనంగా బారసాల

Advertisement

తాజా వార్తలు

Advertisement