Saturday, May 4, 2024

గాయకుడు, మ్యూజిక్ కంపోజర్ రాహుల్ జైన్ పై అత్యాచార కేసు-అరెస్ట్ చేసిన పోలీసులు

బాలీవుడ్ సింగర్ రాహుల్ జైన్ పై ముంబయ్ లో అత్యాచారం కేసు నమోదు అయింది. .బాలీవుడ్ గాయకుడు, మ్యూజిక్ కంపోజర్ రాహుల్ జైన్ ముంబయి సిటీలోని తన ఫ్లాట్ లో 30 ఏళ్ల కాస్ట్యూమ్ స్టయిలిస్ట్ పై అత్యాచారం చేశాడని ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. కాస్ట్యూమ్ డిజైనర్ ను తన ప్లాట్ కు పిలిపించుకుని బలాత్కారం చేశాడన్న ఆరోపణతో అతనికి నోటీసు ఇచ్చారు పోలీసులు. దీని పై బాధితురాలి స్టేట్ మెంట్ కూడా తీసుకున్నారు. రాహుల్ జైన్ తనను .. తాను చేస్తున్న పనిని చూసి బాగుందని మెచ్చుకున్నాడని..

అంతే కాదు…ఒకసారి తన ఫ్లాటుకు రమ్మని ఆహ్వానించాడని బాధిత కాస్ట్యూమ్ స్టయిలిస్టు ఒషివర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్లాట్ కు రమ్మని పిలిచి… తనకు మంచి లైఫ్ ఇస్తానని, తనకు పర్సనల్ కాస్ట్యూమ్ స్టయిలిస్టుగా తన దగ్గరే జాబ్ ఇప్పిస్తానన్నాడ‌ని. అంధేరీలోని అతని ఫ్లాటుకు పిలిపించి తనను బెడ్రూంలోకి తీసుకువెళ్లి తనపై అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదు చేశారు. తాను ప్రతిఘటించి, అతని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నించాని..కాని తనపై రాహుల్ జైన్ బలవంతంగా అత్యాచారం చేశాడన్నరు. అంతే కాదు ఎటువంటి సాక్ష్యాలు మిగలకుండా..వాటినితానే స్వయంగా తొలగించాడని బాధిత మహిళ ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదులో రాహుల్ జైన్ పై పోలీసులు ఐపీసీ సెక్సన్ 376.323,506 ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement