Thursday, May 2, 2024

Teaser release | బీజీఎంఐ బ్రాండ్ అంబాసిడర్‌గా రణవీర్ సింగ్..?

బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) ఇటీవల భారతదేశంలో లాంచ్ అయ్యి మూడు నెలలు పూర్తి చేసుకుంది. 90 రోజుల స్వల్ప వ్యవధిలోనే 15 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను సంపాదించింది ఈ రాయ‌ల్ గేమ్. కాగా, ఈ బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ గేమ్ కి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్ర‌ముఖ బాలీవుడ్ సూపర్ రణవీర్ సింగ్ ఎంపిక‌య్యారు అనే టాక్ వినిపిస్తోంది.

BGMI కి ముఖ చిత్రంగా ఉంటూ దేశవ్యాప్తంగా అనేక మార్కెటింగ్, ప్రచార కార్యక్రమాలలో పాల్గొన‌నున్నాడు ర‌ణ‌వీర్ సింగ్. ఈ రాయల్ బ్యాటిల్ గేమ్ BGMI మరింత ప్రజాదరణ పొందేందుకు.. దేశంలో గేమ్‌ని ప్రోత్సహించడానికి రణవీర్ సింగ్ వంటి వ్యక్తిని అంబాసిడర్‌గా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

కాగా, కొన్ని గంటల క్రితం BGMI అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో Krafton India టీజర్‌ను విడుదల చేసింది. “PLAY PURE” అనే ట్యాగ్‌లైన్‌తో ఉత్కంఠభరితమైన ఈ వీడియోలో ఒక క్యారెక్ట‌ర్ సోఫాపై కూర్చుని ఉన్న‌ట్టు చూద‌వ‌చ్చు.. ఈ క్యారెక్ట‌ర్ కాస్ట్యూమ్ వెనుక R S అనే అక్షరాలు క‌నిపిస్తాయి. అయితే, రణవీర్ సింగ్ BGMI బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారనే వార్త ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. దీనిపై త్వ‌ర‌లోనే క్రాఫ్టన్ ఇండియా నుంచి అప్డేట్ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement