Friday, May 10, 2024

రామ‌బాణం పోస్ట‌ర్.. భైర‌విగా డింపుల్ హ‌య‌తి

శ్రీవాసు డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతోన్న చిత్రం రామ‌బాణం. హీరో గోపీచంద్ 30వ సినిమాగా తెర‌కెక్కుతోంది ఈ చిత్రం. ఈ చిత్రంలో హైదరాబాదీ ముద్దుగుమ్మ డింపుల్ హయతి ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తుంది.. రామబాణంలో భైరవి పాత్ర పోషిస్తోంది డింపుల్ హయతి. తాజాగా మేకర్స్ భైరవి ఫస్ట్ లుక్‌ విడుదల చేశారు. డింపుల్ హయతి క్యూట్‌ లుక్‌లో ట్రావెల్ బ్యాగ్ పట్టుకొని వస్తున్న స్టిల్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.ఈ చిత్రంలో ఖుష్బూ సుందర్‌, జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్‌, నాజర్‌, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిశోర్‌, సప్తగిరి, కాశీ విశ్వనాథ్‌, సత్య, గెటప్‌ శ్రీను, సమీర్‌, తరుణ్ అరోరా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. లక్ష్యం, లౌక్యం సినిమాల తర్వాత శ్రీవాసు-గోపీచంద్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో క్యూరియాసిటీ, అంచనాలు భారీగానే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement