Thursday, May 2, 2024

Breaking: ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌తో రాకేశ్ తికాయ‌త్ భేటీ.. కొన‌సాగుతున్న చ‌ర్చ‌లు

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రైతు సంఘాల నేత రాకేశ్ తికాయ‌త్ ఇవ్వాల ప్ర‌గ‌తి భవ‌న్‌లో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు రాజ‌కీయ అంశాల‌పై వారు చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. భ‌విష్య‌త్ పోరాటాలు, దేశ రాజ‌కీయాలు, బీజేపీ తీసుకుంటున్న నిర్ణ‌యాల వంటి ప‌లు అంశాల‌పై కూలంక‌శంగా చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. చాలా సేప‌టి నుంచి వీరి మ‌ధ్య పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇంకా ఈ చ‌ర్చ‌లు కొన‌సాగుతున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement