Tuesday, April 30, 2024

సంక్రాంతి బరిలో రజనీకాంత్ లాల్ సలాం.. వెల్ల‌డించిన మేక‌ర్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్ మూవీతో సూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజయాన్ని అందుకున్నారు. ఆగస్టు 9న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో వసూళ్ల సునామీ సృష్టించింది. ఐదు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. కాగా, ర‌జనీకాంత్ అభిమానుల‌కు మ‌రో గుడ్ న్యూస్.. ఈ సంక్రాంతికి థియేటర్లలోకి రజనీకాంత్ మ‌రో మూవీ రానుంది. రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించిన లాల్ సలాం సంక్రాంతి బరిలో నిలిచింది. మూవీ నుంచి ఆల్రెడీ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలు.

‘లాల్ సలాం’ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ లీడ్ రోల్స్ లో న‌టిస్తోన్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండ‌గా.. సభాస్కరన్ సమర్పణలో తమిళనాట అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేశారు మేక‌ర్స్. అయితే విడుదల తేదీని ఇంకా వెల్లడించలేదు. త్వరలో అనౌన్స్ చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement