Tuesday, April 30, 2024

చంద్రబాబుతో తలైవా భేటీ

హైదరబాద్ – టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ను సూపర్ స్టార్ రజనీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్‌కి వచ్చిన రజనీకాంత్ దాదాపు చంద్రబాబుతో 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. కుశల ప్రశ్నలతో పాటు.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వస్తున్న మార్పులు, అలాగే రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలన్నీ చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ట్విట్టర్ వేదికగా తన ఫ్రెండ్‌ రజనీకాంత్‌ని ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ.. రజనీకాంత్‌ని శాలువాతో సత్కరిస్తున్న ఫొటోని షేర్ చేశారు చంద్రబాబు.

Advertisement

తాజా వార్తలు

Advertisement