Sunday, April 28, 2024

యూత్ కి కనెక్ట్ అవుతోన్న..రాజమండ్రి రోజ్ మిల్క్ టీజర్

నాని బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం రాజమండ్రి రోజ్ మిల్క్. ఈ చిత్రంలో జై జాస్తి, అనంతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వెన్నెల కిషోర్‌ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి ప్రణీత్‌ ప్రట్టిపాటీ కథను అందించారు. చిత్ర బృందంఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేసింది.లేటెస్ట్‌గా రిలీజైన టీజర్ ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్స్‌తో గడిపిన మధుర జ్ఞాపకాలు, ఫస్ట్‌ లవ్‌, ప్రేమ చెప్పడానికి పడిన పాట్లు అన్ని ఎమోషన్స్‌ను టీజర్‌లో చూపించారు. టీజర్‌ను చూస్తుంటే మన కాలేజ్ డేస్‌ గుర్తుకువస్తున్నాయి. ఈ మూవీలోని మ్యూజిక్ ఫ్రెష్‌ ఫీల్‌ను కలిగిస్తుంది.ఈ చిత్రానికి గోవింద్‌ వసంత్‌ సంగీతం అందిస్తున్నారు. ఈయనతో పాటుగా అజయ్ అరసాడ, యశ్వంత్ నాగ్, భరత్-సౌరభ్‌లు స్వరాలు సమకూరుస్తున్నారు. యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్, ఇంట్రూప్‌ ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement