Tuesday, May 7, 2024

Rains | తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు..

తెలంగాణ‌లో మ‌రో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు నల్గొండ, మెదక్‌, నాగర్‌ కర్నూల్‌, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీంతో ఆయా జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. శుక్రవారం నుంచి పొడివాతావరణం ఏర్పడే సూచనలున్నాయని వివరించింది. ఇవాళ్టి ఉదయం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మరో వైపు మిగతా ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement