Friday, May 3, 2024

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఫ‌స్ట్ లుక్.. రిలీజ్ చేసిన వెంకటేష్

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఫ‌స్ట్ లుక్ ని డిఫ‌రెంట్ గా రాజ‌మండ్రి గోదావ‌రి బ్రిడ్జిపై లాంఛ్ చేశారు హీరో వెంక‌టేష్. ఇతర భాషల్లో కార్తీ, దుల్కర్ సల్మాన్, శివరాజ్ కుమార్, జాన్ అబ్రహం టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం పర్ఫెక్ట్ సినిమాటిక్ సబ్జెక్ట్. ఆయన బయోపిక్ చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ వెండితెర రూపం దాల్చింది. నూతన దర్శకుడు వంశీ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు టైటిల్ తో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఐదు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా టైగర్ నాగేశ్వరరావు విడుదల కానుంది. గజదొంగగా రవితేజ లుక్ ఆకట్టుకుంది. ఆయన కళ్లల్లో ఇంటెన్సిటీ గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంది. దసరా కానుకగా టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న విడుదల కానుంది అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తుండగా… నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీతో రేణూ దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె కీలక రోల్ చేశారు. జీవి ప్రకాష్ సంగీతం అందించారు. కాగా టైటిల్ కి తగినట్టుగానే హీరో రవితేజ లుక్ ను టైగర్ ఫేస్ తరహాలో డిజైన్ చేసి రిలీజ్ చేశారు. ఆయన చూపుల్లో కసి .. కోపం కనిపిస్తున్నాయి. ఈ పాత్రలో రవితేజ ఒక రేంజ్ లో తన సత్తా చూపనున్నాడనే విషయం అర్థమవుతోంది. రవితేజ సరసన హీరోయిన్ గా నుపుర్ సనన్ న‌టిస్తుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement