Wednesday, May 8, 2024

India | రాహుల్‌ పరువు నష్టం కేసు.. సుప్రీంలో పూర్ణేష్‌ మోడీ కేవియట్ దాఖ‌లు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై పరువు నష్టం కేసులో కీలక పరిణామం చోటుచోసుకుంది. రాహుల్‌పై కేసు వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోడీ సుప్రీంకోర్టులో ఇవ్వాల (బుధవారం) కేవియట్‌ దాఖలు చేశారు. గుజరాత్ హైకోర్టు తీర్పుపై రాహుల్‌ గాంధీ అప్పీల్‌ను విచారించాలని కేవియట్‌ పిటిషన్‌లో కోరారు. రాహుల్‌ గాంధీకి విధించిన శిక్షపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ జులై 7న తిరస్కరించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది.

ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సూరత్‌ కోర్టు విధించిన శిక్షపై స్టే విధించాలని పిటిషన్‌ దాఖలు చేస్తే, తన వాదనలను కూడా వినాలని పూర్ణేష్‌ మోడీ కేవియట్‌లో విజ్ఞప్తి చేశారు. 2019 కర్ణాటకలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ ఇంటిపేరునుద్దేశించి రాహుల్‌ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై పూర్ణేష్‌ మోడీ సూరత్‌ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. మెజిస్ట్రేట్‌ కోర్టు రా#హుల్‌ను దోషిగా పేర్కొంటూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత రాహుల్‌ పార్లమెంట్‌ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆ తర్వాత సూరత్‌ సెషన్స్‌ కోర్టు, గుజరాత్ హైకోర్టును ఆశ్రయించినా శిక్షపై స్టేను విధించేందుకు నిరాకరించాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. ఈ క్రమంలో పూర్ణేష్‌ కేవియట్‌ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement