Monday, April 29, 2024

Rahul Gandhi: రెజ్లింగ్ క్రీడాకారుల‌తో రాహుల్ భేటి.. వారి నిర‌స‌న‌కు సంఘీభావం …

హర్యానా: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రముఖ రెజ్లింగ్‌ క్రీడాకారుడు బజరంగ్‌ పూనియా, ఇతర రెజ్లింగ్‌ క్రీడాకారులను హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఛారా గ్రామంలొ కలుసుకున్నారు. ఆయన నేటి ఉదయమే రెజ్లింగ్‌ క్రీడాకారులు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రదేశానికి వెళ్లారు.

భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్ష ఎన్నికకు సంబంధించి.. రెజ్లింగ్‌ క్రీడాకారులు నిరసన తెపుతున్న విషయం తెలిసిందే. భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్‌ సింగ్‌ ఎంపికను నిరసిస్తూ బజరంగ్‌ పూనియా తనకు వచ్చిన పద్మశ్రీ అవార్డును ఎనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు..ఈ నేప‌థ్యంలోనే రాహుల్‌ గాంధీ క్రీడాకారులతో భేటీ అయి వారికి మద్దతుగా ప్ర‌క‌టించారు.. వారి ఆందోళ‌న‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement