Friday, April 26, 2024

జగన్ సర్కారు తీరు కారణంగా 150 మంది రైతులు మృతి: రఘురామ

జగన్ ప్రభుత్వంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి ఆరోపణలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇంతకాలం వైసీపీ నేతలు నిందలు వేశారని… సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇప్పుడు వారేమంటారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరువల్ల 150 మందికి పైగా రైతులు మృతి చెందారని, వారి మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని రఘురామ అన్నారు. దసపల్లా హోటల్ భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై నిజాయతీ కలిగిన అధికారితో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.

తనపై అనర్హత వేటు పడే అవకాశమే లేదని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. మీ బెయిల్ ను రద్దు చేయమని కోర్టును కోరితే రాజద్రోహం ఎలా అవుతుందని సీఎం జగన్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయాలని జగన్ ఆదేశిస్తే… రాజీనామాలు చేసేందుకు ఎంపీలందరం సిద్ధమని చెప్పారు. పెగాసెస్ సాఫ్ట్ వేర్‌ను వైసీపీ ప్రభుత్వం చాలా మందిపై వాడారని తెలుస్తోందని, అది వాడటానికి మీరు కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారా? అని రఘురామ ప్రశ్నించారు.

ఈ వార్త కూడా చదవండి: అత్తకు బాయ్‌ఫ్రెండ్ కావాలని కోడలి ప్రకటన

Advertisement

తాజా వార్తలు

Advertisement