Thursday, April 18, 2024

రాజ్ కుంద్రా న్యూడ్ గా ఆడిషన్ అడిగాడు: నటి సాగరిక సోనా

ఫోర్న్ రాకెట్ కేసులో అరెస్టయిన శిల్పా శెట్టి భర్త, ఎంట్రప్రెన్యూర్ రాజ్ కుంద్రా ఆగడాలు ఒక్కక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే మీటు, డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న రాజ్ కుంద్రా తాజాగా ఫోర్న్ రాకెట్ కేసులో సూత్రధారిగా అరెస్టయ్యారు. అయితే వెబ్ చిత్రాలు నిర్మిస్తున్నానే నెపంతో కొంత మంది అమ్మాయిలను ఆడిషన్ చేసేవాడు.. అయితే అందులో నటి మొడల్ సాగరిక సోనా సుమన్ ఒకరు.. రాజ్ కుంద్రాతో తనను అడిషన్ నిర్వహించనప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బహిర్గతం చేసింది సాగరిక.. రాజ్ కుంద్రా తనను నగ్నంగా ఆడిషన్ ఇమ్మని అడిగారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది సోనా. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కొంతకాలంగా తాను ఇండస్ట్రీలో ఉంటున్నా పెద్దగా అవకాశాలు రాలేదని, గతేడాది ఉమేశ్ కామత్ అనే వ్యక్తి కాల్ చేసి, రాజ్ కుంద్రా నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌లో అవకాశం ఇప్పిస్తానని చెప్పాడు. రాజ్ కుంద్రా ఎవరు అని అడిగితే శిల్పా శెట్టి భర్త అని కూడా చెప్పాడు. అంటూ ఆ వీడియోలో చెప్పింది.

లాక్‌డౌన్ కాబట్టి వీడియో కాల్ ద్వారా ఆడిషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడంతో నేను కాల్ చేశాను. ఇక కాల్ చేశాక న్యూడ్‌గా ఆడిషన్ ఇవ్వమనడంతో షాకయ్యాను. అలా కుదరదని గట్టిగా చెప్పాను. ఆ వీడియో కాల్‌లో ముగ్గురు జాయిన్ అయ్యారు. వాళ్లల్లో ఒక వ్యక్తి తన ఫేస్ కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. కానీ అతనే రాజ్ కుంద్రా అనుకుంటున్నాను. అతడే కనుక ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసినట్లయితే అరెస్ట్ చేసి, నాలా ఇంకెంతమందితో ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడ్డాడో విచారించి ఈ రాకెట్ బయటపెట్టాలని పోలీసులను కోరుతున్నాను’ అంటూ రాజ్ కుంద్రా గురించి కామెంట్స్ చేసింది సాగరిక సుమన్.

YouTube video


ఇది కూడా చదవండి : అత్తకు బాయ్‌ఫ్రెండ్ కావాలంటూ కోడలి ప్రకటన

Advertisement

తాజా వార్తలు

Advertisement