Tuesday, May 14, 2024

చంద్ర‌ముఖి2 – అప్ డేట్ ఇచ్చిన మేక‌ర్స్

చంద్ర‌ముఖి చిత్రానికి సీక్వెల్ గా తెర‌కెక్కుతోంది చంద్ర‌ముఖి2 చిత్రం.కాగా రీసెంట్ గా మైసూరు షెడ్యూల్ కంప్లీట్ అయింద‌ని చిత్ర మేక‌ర్స్ తెలిపారు.త‌మిళ ద‌ర్శ‌కుడు పి వాసు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది ఈ చిత్రం. అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు యాక్ట‌ర్, కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌గా సుప‌రిచితుడైన‌ రాఘ‌వా లారెన్స్ హీరోగా న‌టిస్తున్నారు. చంద్ర‌ముఖి2 లో ల‌క్ష్మీ మీన‌న్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో క‌నిపించ‌బోతుంది. ఈ చిత్రానికి ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తుండ‌గా..తోట తరణి ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. కొన్ని రోజుల కిత్రం స్టార్ హీరో ర‌జనీకాంత్ ఆశీస్సులు తీసుకున్న అనంత‌రం మైసూరు షూటింగ్ షెడ్యూల్‌లో జాయిన్ అయ్యారు రాఘ‌వా లారెన్స్.ఇప్ప‌టికే ఓ బంగ్లా బ్యాక్ డ్రాప్‌లో విడుద‌లైన లుక్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది. ఫ‌స్ట్ పార్టు చంద్ర‌ముఖిలో కామెడీ టైమింగ్‌తో అంద‌రినీ న‌వ్వించిన లెజెండ‌రీ కమెడియ‌న్ వ‌డివేలు సీక్వెల్‌లో కూడా సంద‌డి చేయ‌బోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement