Friday, May 17, 2024

ఆంక్షలు విధిస్తే.. అంతే, పశ్చిమ దేశాలకు పుతిన్‌ వార్నింగ్‌

రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించి.. పరిస్థితుల్ని మరింత దిగజార్చేలా చేయవద్దని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తున్న పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రభుత్వానికి చెందిన రష్యా 24 ఛానెల్‌తో పుతిన్‌ మాట్లాడారు. తమ ఇరుగుపొరుగు దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయన్నారు. తమకు ఈ దేశాలతో ఎలాంటి వైరం లేదన్న పుతిన్‌.. వెంటనే ఆంక్షలు ఎత్తేయాలని హెచ్చరించారు. ఇలా చేయడంతో.. ఇరువురి మధ్య సంబంధాలు చెడిపోయే అవకాశం ఉందని అన్నారు. తమకు ఇలాంటి ఉద్దేశం లేదని చెప్పుకొచ్చాడు. సంబంధాలను ఎలా తిరిగి గాడిలో పెట్టుకోవాలి అని అందరూ ఆలోచించాలని, ఎప్పట్లాగే సహకరించుకోవాలని సూచించారు. సంబంధాలు పెంచుకోవాలని కోరారు.

అనుకున్న లక్ష్యాలు సాధించాం..

ఉక్రెయిన్‌పై యుద్ధం అంతా తాను ప్లాన్‌ చేసినట్టే జరుగుతోందని, ఇప్పటి వరకు అనుకున్న లక్ష్యాలను సాధించామని, ఉక్రెయిన్‌లో ఇప్పటికే పలు కీలక నగరాలపై పట్టు సాధించామని రష్యా సెక్యూరిటీస్‌ కౌన్సిల్‌ సమావేశంలో పుతిన్‌ చెప్పుకొచ్చారు. రష్యాపై మరింతగా ఒత్తిడి పెంచే అంశంపై చర్చించేందుకు బ్రస్సెల్స్‌లో పాశ్చాత్య దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పుతిన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రష్యాకు వ్యతిరేకంగా జరిగిన చర్యల కారణంగానే రష్యా సైన్యం అడుగులు వేయాల్సి వచ్చిందని పుతిన్‌ మరోసారి చెప్పుకొచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement