Friday, May 3, 2024

ఇండియన్ 2లో నటించనున్న.. పంజాబ్ సింహం యోగ్‌రాజ్‌

ఇండియన్ 2లో నటించేందుకు పంజాబ్ సింహం సిద్ధంగా ఉందని పోస్ట్ చేశారు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌. ఈ చిత్రంలో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయన్ని స్వయంగా యోగ్‌రాజ్ సింగ్‌ వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు మేకప్‌ వేస్తున్న ఫోటోను షేర్‌ చేస్తూ కెమారా వెనుకు పనిచేసే అందరికీ ధన్యవాదాలు. నన్ను మరింత స్మార్ట్‌గా తయారుచేస్తున్న మేకప్ మేన్‌కు ధన్యవాదాలు.ఈ చిత్రంలో విశ్వ నటుడు కమల్‌ హాసన్ కి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జియాంట్‌ మూవీస్‌ బ్యానర్‌లపై సుభాస్కరణ్‌, ఉదయనిధి స్టాలిన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా షూటింగ్‌ జరగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement