Thursday, May 16, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం..

  1. నీ నాయం దొడబాటు మాట వినుమా, నీ చేత జీతంబు నే
    గానిం బట్టక సంతతంబు మది వేడ్కం గొల్తు నంతస్సప
    త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలు తే
    జీ నొల్లం గరి నొల్ల నొల్ల సిరులన్ శ్రీకాళహస్తీశ్వరా!
    ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా! నీ్శ నా యందు- నీకు, నాకు మధ్య, ఒడబాటు మాట- ఒప్పందమును, వినుమా!- వినవలసినది, నీ చేత- నీ నుండి, జీతంబు్స వేతనము, ఏ గానిన్- ఏగాని కూడా ( కానీ అనబడే రూపాయ లో 64 వ వంతు కన్న తక్కువ), పట్టక- పుచ్చుకొనక, సతతంబు్స ఎల్లప్పుడు, మదిన్- మనసులోని, వేడ్కన్- కోరికతో, కొల్తున్- సేవించుకుంటాను. నన్ను- నన్ను, అంతః- సపత్న- అనీకంబునకు- అంతశ్శత్రువుల సముదాయానికి, ఒప్పగింపకుము- అప్ప గించ వద్దు( వారి వశం చేయ వద్దు), ఆ పాటియే- ఆ మాత్రపు అనుగ్రహమే, చాలున్- నాకు చాలు. తేజీన్-గుఱ్ఱాన్ని, ఒల్లన్- అంగీకరించను ( కోరను), కరిన్- ఏనుగని, ఒల్లన్- కోరను, సిరులన్- సంపదలని, ఒల్లన్- కోరను.
    తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! మన ఇద్దరి మధ్య ఒక ఒప్పందం చేసుకుందాం. విను. నిన్ను నేను ఎంతో సంతోషంగా సేవించుకుంటాను. దానికి ప్రతిగా ఏగానీ జీతమైనా ఆశించను. గుఱ్ఱాలు, ఏనుగలు, ధనలు అక్కఱ లేదు. అంతశ్శత్రువులైన కామ క్రోధాదులకు నన్ను ఆధీనము చేయక కాపాడు. అది చాలు నాకు.
    విశేషం: అంతశ్శత్రువులు : కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. మానవుడు పుట్టినప్పుడు స్వచ్ఛంగా, నిర్మలంగా, ఉంటాడు. పసితనం నుండి ఎదుగుతున్నప్పుడు ఆత్మీయుల వలె చేరి, మనిషిని లోబరచుకునే గుణాలు ఈ ఆరు. ఇవి కంటికి కనపడవు, పైకి తేలవు. కనుక వీటిపై యుద్ధం చేయటం చాల కష్టం. ఇవి ఒకదానితో మరొకటి సంబంధం ఉన్నవి, కలిసికట్టుగా ఉండేవి. విడిగా దొరకవు. గెలవాలంటే అన్నిటినీ కలిపి గెలవాలి. మిగిలిన ఐదింటికి మూలమైనది మొదటిదైన కామం. దాన్ని దాన్ని అదుపులో పెడితే మిగిలినవి క్రమంగా లొంగుతాయి. ఈశ్వరుణ్ణి ప్రార్థించిన క్షణాన్నే కామనిరాసనం జరిగి తానేమీ కోరను అని ఘంటాపథంగా చెప్పటం జరిగింది. ఈశ్వర సేవ సద్యః ఫలదాయకం.
డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement