Friday, April 26, 2024

ప్రపంచాన్ని చూస్తున్న పునీత్ క‌ళ్లు..

అక్టోబర్ 29 శుక్రవారం ఉదయం పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు తో మరణించారు. కేవలం 46 ఏళ్ల వయసు లోనే పునీత్ తన కుటుంబాన్ని, కోట్ల మంది అభిమానులను వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగబోయింది. పునీత్ మరణం కన్నడ ఇండస్ట్రీ ని కుదిపివేసింది. పునీత్ ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు అంతకన్నా గొప్ప వ్యక్తి కూడా. ఆయన దాతృత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. చనిపోయిన తర్వాత కూడా పునీత్ రాజ్ కుమార్ నలుగురు అభిమానులలో బతికే ఉన్నారు. ఆయన కళ్ళు ఇంకా ప్రపంచాన్ని చూస్తూనే ఉన్నాయి.

అనాథలైన పిల్లల నుండి వృద్ధుల వరకు తన బాధ్యత నెరవేర్చిన పునీత్ తన కళ్ళు కూడా ఇతరులకు ఉపయోగపడాలని నేత్ర దానం చేశారు. ఆయన మరణం తర్వాత తన కళ్ళను శరీరం నుండి సేకరించి బెంగుళూరులోని నారాయణ నేత్రాలయం లో భద్రపరిచారు. ఆ కళ్లను శనివారం నలుగురు యువకులకు అమర్చినట్టు నేత్రాలయ చైర్మన్‌ డాక్టర్‌ భుజంగశెట్టి తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక్కో కార్నియా (నల్లగుడ్డు)ను పై పొర, లోపలి పొర అని రెండు భాగాలుగా విభజించి ఆ పొరలు అవసరం ఉన్న నలుగురిలో అమర్చామని వివరించారు. చనిపోయాక కూడా పునీత్ తన కళ్ళ ద్వారా నలుగురి జీవితాలలో వెలుగు నింపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement