Sunday, April 28, 2024

Latest | షూటింగ్‌లో గాయపడిన పృథ్వీరాజ్.. తన ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్‌డేట్

కొన్ని రోజుల క్రితం, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ త‌న అప్ క‌మింగ్ మూవీ ప్రాజెక్ట్స్ లో ఒక‌టైన‌ విలయత్ బుద్ధ షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీక‌రిస్తుండ‌గా ప్రమాదానికి గురయ్యాడు. దీంతో కొన్ని రోజులు షూటింగ్ కు దూరం ఉండాల‌ని డాక్ట‌ర్లు సూచించారు. కాగా, ఇప్పుడు పృథ్వీరాజ్ త‌న‌ ఆరోగ్య పరిస్థితిపై ఓ ప్రకటన విడుదల చేశారు.

తన పట్ల ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. తనకు కీహోల్ సర్జరీ జరిగిందని, కోలుకుంటున్నట్లు పృథ్వీరాజ్ తెలిపాడు. రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని, వీలైనంత త్వరగా యాక్షన్‌లోకి దిగుతానని పృథ్వీరాజ్ వెల్ల‌డించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement