Saturday, May 4, 2024

Tollgate | కొత్త టోల్ చార్జీల అమలు వాయిదా.. లోక్ సభ ఎన్నికల తర్వాతే

హైవేలపై కొత్త యూజర్ ఫీ (టోల్) రేట్ల గణనను చేపట్టేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)కి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. అయితే, టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని భారత ఎన్నికల సంఘం NHAIని ఆదేశించింది.

వార్షిక షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులపై అమలు చేయనున్న కొత్త యూజర్ ఫీజు (టోల్) రేట్లను లోక్ సభ ఎన్నికల తర్వాత అమలు చేయాలని ఆదేశించింది. సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి అభ్యర్థన మేరకు ఎన్నికల ఈసీ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement