Friday, May 3, 2024

పోన్నియ‌న్ సెల్వ‌న్ 2 ఓటీటీ డేట్ ఫిక్స్..?

మణిరత్నం దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ పాన్-ఇండియన్ మూవీ పొన్నియిన్ సెల్వన్-2. ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా, ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా థియేటర్లలో రిలీజ్ 25 రోజుల థియేట్రిక‌ల్ రన్ పూర్తి చేసుకుంది. ఇక తాజా స‌మాచారం ప్రకారం.. ఈ మూవీ ఈ వారం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానున్న‌ట్టు తెలుస్తొంది. అయితే ఓటీటీ సంస్థ ఈ మూవీని అద్దె ప్రాతిపదికన మే 26న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అయితే, OTT ప్లాట్‌ఫారమ్ ద్వారా ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement