Friday, May 17, 2024

టిఆర్ఎస్ ప్రశ్నించిన వారిపై కేసులా?: మాజీ పీసీసీ చీఫ్

ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య అన్నారు. ప్రజాస్వామ్య విలువలను మరిచి ప్రతిపక్షాలపై కేసు పెట్టిన దౌర్భాగ్య పరిస్థితి టిఆర్ఎస్ కే దక్కిందని విమర్శించారు. జనగామ జిల్లా కోర్టుకు జిల్లా ఉద్యమ కేసులపై హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు ఉద్యమాలు చేస్తుంటే ప్రజలపై 144 సెక్షన్ విధించి ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేశారని అన్నారు. పరాయి పాలనలో ప్రజల మనోభావాలను దెబ్బ తీయకుండా భావ స్వేచ్ఛ ఉండేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో నియంత పాలన కొనసాగించిన హిట్లర్ లాంటి వారే ప్రజల చేతిలో కాలగర్భంలోకి కలిసిపోయారని గుర్తు చేశారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ ప్రభుత్వానికి అదే గతి పడుతుందని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement