Tuesday, April 30, 2024

ఓటు తో పాటు.. బీజేపీ మీద పంచ్ వేసిన కేటీఆర్

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఇప్పటికే చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షేక్ పేట్ తహసీల్దార్ కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న కేటీఆర్ అనంతరం మీడియా తో మాట్లాడుతూ గతంలో ఒక మహానుభావుడు చెప్పినట్టుగా ఇంట్లో సిలిండర్ కి దండం పెట్టి వచ్చి ఓటు వేశానని పంచ్ డైలాగ్ వేశారు. విద్యావంతులు, యువకుల సమస్యలను అర్థం చేసుకొని తీర్చగలిగే సామర్థ్యము, అవకాశం ఉన్న అభ్యర్థికే ఓటు వేశానని కేటీఆర్ అన్నారు. విద్యావంతులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనరన్న అపవాదు ఉంది. దాన్ని తొలగించుకొని గ్రాడ్యుయేట్లు పెద్దఎత్తున ఓటింగ్ వేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధికి పాటుపడిన అభ్యర్థికి ఓటు వేయాలని గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సెలవు అయినప్పటికీ తమ బాధ్యతగా బయటకు వచ్చి ఓటు వేయాలని విద్యావంతులకు కోరారు

ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అయిన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం మహబూబ్ నగర్- రంగారెడ్డి -హైదరాబాద్ నియోజకవర్గంలో లో 5,31,268 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.అలాగే వరంగల్- ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 5,05,565 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహబూబ్ నగర్ -రంగారెడ్డి- హైదరాబాదు నుంచి 93 అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గం నుండి 71 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement