Sunday, October 6, 2024

నాగ‌శౌర్య విల్లాపై పోలీసుల దాడి-పేకాట ఆడుతోన్న 25మంది అరెస్ట్..

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలోని మంచిరేవుల వద్దనున్న హీరో నాగశౌర్య విల్లాపై పోలీసులు దాడి చేశారు. సుమన్ అనే వ్యక్తి బర్త్ డే ఫంక్షన్ కోసం ఈ విల్లాను అద్దెకు తీసుకుని దానిని పేకాట స్థావరంగా మార్చినట్టు స‌మాచారం.ప‌క్కా స‌మాచారంతో పోలీసులు ఈ విల్లాపై దాడిచేసి 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వ‌ద్ద నుంచి రూ. 6.7 లక్షల నగదు, 33 సెల్‌ఫోన్లు, 24 కార్లు, 2 క్యాసినో డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సుమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల రాకను గుర్తించిన కొందరు తప్పించుకునేందుకు మద్యం సీసాలను వారిపైకి విసిరినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరు నెలల క్రితం ఈ విల్లాను నాగశౌర్య అద్దెకు తీసుకున్నారు. మ‌రి ఈ ఫామ్‌హౌస్‌ను పేకాట స్థావరంగా మార్చిన విషయం నాగశౌర్యకు తెలుసా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement