Thursday, November 14, 2024

క‌రోనా బారిన ప‌డిన న‌టి..రాజ‌కీయ నేత ఊర్మిళ‌..

క‌రోనా క‌ల‌క‌లం ఇంకా త‌గ్గుముఖం ప‌ట్ట‌లేదు..ఎక్క‌డోచోట కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. కాగా తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నటి, రాజకీయ నేత ఊర్మిళ కరోనా బారిన ప‌డ్డారు. త‌న‌కు క‌రోనా సోకిన‌ విషయాన్ని ఆమె త‌న ట్విటర్ లో తెలిపారు. నాకు కొవిడ్‌ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్ర‌స్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాను. గ‌త వారం రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్న‌ వారు కరోనా పరీక్షలు చేయించుకోండి. ప్రియమైన వారందరినీ ప్రేమగా చూసూకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి జరుపుకొండ‌ని చెప్పారు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోని ప‌లు చిత్రాల్లో న‌టించారామె.

Advertisement

తాజా వార్తలు

Advertisement