Monday, April 29, 2024

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి.. నేతల ఘన నివాళి..

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. శనివారం ఉదయం రాజ్​ఘాట్​ను సందర్శించిన మోదీ.. గాంధీ సమాధికి పుష్పాంజలి ఘటింటారు. మోదీతోపాటు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు గాంధీ సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. అలాగే, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని ఆయనకు నేతలందరూ నివాళులు అర్పించారు.

బాపూజీ జీవితం దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తాయని మోదీ అన్నారు. గాంధీ ఆచరించిన సూత్రాలు సమకాలీన ప్రపంచానికి చాలా అవసరమని చెప్పారు. ఇవి లక్షలాది మందికి బలాన్నిస్తాయని తెలిపారు.

ఇది కూడా చదవండిః పవన్ కల్యాణ్ శ్రమదానంపై టెన్షన్..

Advertisement

తాజా వార్తలు

Advertisement