Friday, May 31, 2024

UP : ఇవాళ ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..

ఇవాళ ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్ లో పర్యటించనున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో చివరి దశ ఏడో విడత ఎన్నికలలో భాగంగానే ప్రధాని మోడీ నేడు మిర్జాపూర్, మౌ, డియోరియాలలో నిర్వహించే బహిరంగ సమావేశాల్లో పాల్గొని పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.

తొలి సమావేశం ఉదయం మీర్జాపూర్‌లో జరగనుంది. బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్) జాతీయ అధ్యక్షురాలు, కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అప్నా దళ్ (ఎస్) కూడా రాబర్ట్స్‌గంజ్ స్థానం నుంచి పోటీలో ఉంది. అక్కడి నుంచి పార్టీ ఎమ్మెల్యే రింకీ కోల్‌ను రంగంలోకి దించింది. ఇద్దరు అభ్యర్థులకు ఓటు వేయాలని మోడీ ప్రజలకు కోరనున్నారు. అలాగే మౌలోని మేవారి కలాన్‌లోని ఘోసి, బల్లియా, సేలంపూర్‌లో బీజేపీ, దాని మిత్రపక్షాల అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని మోడీ ప్రచారం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు డియోరియాకు చేరుకుంటారు.

- Advertisement -

అక్కడ రుద్రాపూర్‌లో ఆయన ఎన్నికల సభలో పాల్గొంటారు. బన్స్‌గావ్, డియోరియా నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు సపోర్టుగా మోడీ ప్రచారం నిర్వహించనున్నారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీర్జాపూర్, వారణాసి, ఘాజీపూర్, గోరఖ్‌పూర్‌లలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. మిర్జాపూర్‌లో ప్రధాని మోడీతో జరిగే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత వారణాసిలోని శివపూర్‌లోని కచ్చా బాబా ఇంటర్ కాలేజీలో, మధ్యాహ్నం ఘాజీపూర్‌లోని టౌన్ నేషనల్ ఇంటర్ కాలేజీలో చందౌలీ లోక్‌సభ స్థానం అభ్యర్థికి అనుకూలంగా ఎన్నికల సమావేశంలో ప్రసంగించనున్నారు. సాయంత్రం గోరఖ్‌పూర్‌లోని జనతా ఇంటర్‌ కళాశాలలో ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement