Friday, May 31, 2024

JEE : ఇవాళ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పరీక్ష

దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ -2024 పరీక్షను ఇవాళ నిర్వహిస్తున్నారు. రెండు షిఫ్టుల్లో పరీక్ష జరగనుంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీలోని 26, తెలంగాణలోని 13 నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

- Advertisement -

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 3 గంటల వ్యవధి ఉంటుంది. అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరు కావాలి. మొదటి పేపర్‌ను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. రెండో పేపర్‌ను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.

ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా 2.50 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్ రాయనున్నారు. జేఈఈ మెయిన్స్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన వారికి మాత్రమే ఈ పరీక్షలో హాజరుకావడానికి అనుమతి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా ఉత్తీర్ణత సాధిస్తే ఐఐటీల్లో బీటెక్ సీట్లకు పోటీపడే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement