Saturday, June 29, 2024

TTD | తిరుమలలో జూన్ ఒకటి నుంచి హనుమజ్జయంతి వేడుకలు

హనుమాన్ జయంతి సందర్భంగా జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు తిరుమలలోని అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జపాలి తీర్థంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ ఐదురోజులూ.. ఆకాశగంగలోని బాలాంజనేయస్వామి, అంజనాదేవికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు.

అలాగే జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. నాద నీరాజనం వేదికపై ప్రతిరోజు మధ్యాహ్నం హనుమన్ జననం సహా హనుమంతునికి సంబంధించిన ఇతర ఆసక్తికరమైన అంశాలపై వేద పండితులచే ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement