Friday, April 26, 2024

సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌

ఏపి సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ ద్వారా జగన్ ను విష్ చేశారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ట్వీట్ చేశారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఏపీ సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. సీఎం జగన్ సుఖం శాంతులతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement