Wednesday, May 19, 2021

ఇదేం ఆచారం..? దున్నపోతుతో తొక్కించుకున్న ప్రజలు

భారతదేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారాలు ఉంటాయి. కానీ ఒక్కో ప్రాంతంలో ప్రజలు పాటించే వింత ఆచారాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తుంటాయి. తూ.గో. జిల్లాలో కూడా ఓ ప్రాంతంలో వింత ఆచారాన్ని ప్రజలు పాటిస్తున్నారు. దున్నపోతుతో తొక్కించుకుంటే త‌మ‌ గ్రామానికి అరిష్టం తొల‌గిపోతుంద‌ని, తమ కష్టాలు తీరిపోతాయ‌ని గ్రామ ప్ర‌జలంతా బోర్లాప‌డుకుని దున్న‌పోతుతో తొక్కించుకున్నారు. యు.కొత్త‌ప‌ల్లి మండ‌లం అమీనాబాద్ గ్రామంలో ఆదివారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గ్రామంలో ప్ర‌తి ఏడాది జ‌రిగే పోలేర‌మ్మ జాత‌ర సంద‌ర్భంగా గ్రామ‌స్తులు దున్న‌పోతుతో తొక్కించుకునే ఆచారం అనాదిగా వ‌స్తున్న‌ద‌ని వారు చెప్తున్నారు.

పోలేర‌మ్మ జాత‌ర‌ సందర్భంగా ఉదయం నుంచి ఉపవాసం ఉన్న భక్తులు, గ్రామస్తులు సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దున్నపోతుకు పూజలు చేసి, గరగ నృత్యాల మధ్య గ్రామంలో ఊరేగించి, ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఉపవాసం ఉన్న భక్తులందరూ పసుపు నీళ్లతో స్నానం చేసి అమ్మవారి ఆలయం ఎదురుగా బారులు తీరి పడుకున్నారు. ఆ త‌ర్వాత ఓ భ‌క్తురాలు వారిని తొక్కుతూ వెళ్తుండ‌గా ఆమె వెనుక‌నే దున్న‌పోతు కూడా తొక్కుతూ వెళ్లింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News