Thursday, May 2, 2024

Pension for Batchelors – ఇక పెళ్లికాని ప్రసాద్ లకు ‘పెన్షన్’

చండీగఢ్ — హీరో వెంకటేష్ నటించిన చిత్రం ‘మల్లీశ్వరి’. ఈ చిత్రంలో హీరో పేరు ప్రసాద్. ఎంతకీ వివాహం కాకపోవడంతో హీరోను ప్రతి ఒక్కరూ పెళ్లికాని ప్రసాద్ అని పిలుస్తుంటారు. ఇపుడు అలాంటి పెళ్లికాని ప్రసాద్‌లకు పింఛన్ ఇవ్వనున్నారు. ఈ వింత నిర్ణయం తీసుకుంది బీజేపీ పాలిత హర్యానా ప్రభుత్వం. పెళ్లికాని 45 – 60 యేళ్ల మధ్య ఉన్న వారికి పింఛను ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది..

ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని సాక్షాత్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. ఈ పథకం అమలుపై నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. కర్నాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎ ఖట్టర్ పాల్గొన్న. ఈ సందర్భంగా 60 యేళ్ల పెళ్లికాని వ్యక్తి మాట్లాడుతూ పింఛను దరఖాస్తు విషయంలో తాను సమస్యలు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. దీనికి సీఎం ఖట్టర్ సమాధానమిస్తూ, ’45 యేళ్ల పైబడిన వివాహం కాని మహిళలు, పురుషులకు నెలవారీ పింఛన్ ఇచ్చేలా కొత్త పథకాన్ని నెల రోజుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం’ అని చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement