Sunday, April 28, 2024

PBKS vs GT | ఛేజింగ్‌లో కష్టపడ్డ గుజరాత్.. పంజాబ్‌పై గెలుపు

మొహాలీలోని మహారాజా యదవీంద్ర స్టేడియం వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. స్వల్ప టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగన గుజరాత్‌… 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈజీ టార్గెట్ చేజింగ్‌లో వికెట్లు కోల్పోతున్న.. నిలకడగా ఆడుతూ గుజరాత్‌ బ్యాటర్లు లక్ష్యాన్ని చేరుకున్నారు. 5 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ చేధించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న గుజరాత్ 8 పాయింట్లతో 6వ స్థానానికి చేరుకుంది.

శుభ్‌మన్‌గిల్‌ (35), సాయి సుదర్శన్‌ (31) ఇద్దరూ ఫర్వాలేదనిపించారు. ఇక చివరలో రాహుల్‌ తెవాటియా (31) విజృంభించడంతో 19.1 ఓవర్‌లోనే లక్ష్యాన్ని చేధించి.. పంజాబ్‌ను ఓడించారు. ఇక మిగిలిన బ్యాటర్లెవ్వరూ అంతగా మెప్పంచలేకపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement