Saturday, May 4, 2024

Pawan with Saidharm – ఏంటీ “బ్రో”…పోస్ట‌ర్ తోనే అద‌ర‌గొట్టేశారు ….

సుప్రీం హీరో సాయిధరమ్‌తో కలిసి ప‌వ‌ర్ స్టార్ పవన్ క‌ల్యాణ్ ‘బ్రో’ మూవీ చేస్తున్నాడు. తమిళంలో సూపర్‌ హిట్టయిన ‘వినోదయ సిత్తం’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఒరిజినల్‌ వెర్షన్‌ను తెరకెక్కించిన సముద్రఖని రీమేక్‌ వెర్షన్‌ను కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్‌ వర్క్‌ను కంప్లీట్‌ చేసుకుంటుంది.

తాజాగా ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. పవన్, సాయిధరమ్‌ లుంగీలు కట్టుకుని, మెడలో ఎర్ర కండువా వేసుకుని కూలీ గెటప్‌లో అదిరిపోయారు.ఈ పోస్టర్‌ అభిమానులతో పాటు ప్రేక్షకులను సైతం తెగ ఆకట్టుకుంటుంది. పీపుల్ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement