Wednesday, May 1, 2024

ఏపీకి కాబోయే సీఎం పవన్ కళ్యాణ్… సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పవన్ అంటే ప్రధాని మోడీ, అమిత్ షా కు అమితమైన అభిమానం అని సోము వీర్రాజు తెలిపారు. పవన్ కు సముచిత గౌరవం ఇవ్వాలని మోడీ నాకు సూచించారన్నారు.

ఈ అంశాన్ని ట్రూ స్పిరిట్ తో బిజెపి జనసేన కార్యకర్తలు తీసుకోవాలన్నారు. తిరుపతిలో జరిగిన ఇరు పార్టీల సమన్వయ భేటీలో సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఏపీలో బీజేపీ జనసేన సంయుక్తంగా ఎన్నికల్లో పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా బిజెపి అభ్యర్థి రత్నప్రభ కు జనసేన మద్దతు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement