Monday, April 29, 2024

ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన పార్టీని నడపడటం ఓ సాహసమే: పవన్

విజయవాడలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కరోనా మృతులకు సంతాపం ప్రకటించారు. కరోనా కారణంగా ఎంతో మంది చనిపోయారని, కరోనా వల్ల జనసైనికులను కోల్పోవడం వ్యక్తిగతంగా ఎంతో బాధించిందని పవన్ తెలిపారు. నంద్యాలకు చెందిన సోమశేఖర్‌ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. కరోనా కష్టకాలంలో జనసైనికులు ఎంతో మంది సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని పవన్ పేర్కొన్నారు. దాదాపు లక్ష మంది కార్యకర్తలకు జనసేన తరఫున బీమా సౌకర్యం కల్పించామన్నారు. ఈ బీమా పథకానికి తన వంతుగా రూ.కోటి ఇచ్చినట్లు పవన్ తెలిపారు.

ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో జనసేన పార్టీ కృషి చేస్తుందని పవన్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన పార్టీని నడపడం సాహసోపేత చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజలతోనే జనసేన పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తల అండతో ప్రజలకు మరింత సేవ చేద్దామని పవన్ పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: భూమా అఖిలప్రియ భర్తపై మరో కేసు నమోదు

Advertisement

తాజా వార్తలు

Advertisement