Tuesday, March 28, 2023

అమెజాన్ ప్రైమ్ లో ప‌ఠాన్.. ఎప్పుడంటే

బాలీవుడ్ మూవీ ప‌ఠాన్ విజ‌యంతో బాలీవుడ్ కి ఊపు వ‌చ్చింది. మొదటి రోజే హిట్‌ టాక్‌ తెచ్చుకున్న బాద్‌షా షారూఖ్ ఖాన్ సినిమాకు వసూళ్ల సునామీ సాగుతుంది. షారుఖ్‌ హీరోగా దీపికా పదేకొణె హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఒక్క హిందీ బెల్ట్‌లోనే 55 కోట్ల రూపాయల వరకూ నెట్‌ కలెక్సన్లను వసూలు చేసింది. భారీ అంచనాల మధ్య అత్యంత భారీ స్క్రీన్ లలో రిలీజ్ అయిన ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మంచి కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో షారుఖ్ అభిమానులు మాత్రమే కాదు.బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం చాలా రోజుల తర్వాత వచ్చిన విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.కాగా ఈ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ని అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకుంది.ఏప్రియల్ 25, 2023 నఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement