Friday, April 26, 2024

ఇకపై డిగ్రీ పాసవ్వడం అంత ఈజీ కాదు.. పరీక్షా విధానంలో సమూల మార్పులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇకపై ఏదో చదివాము..పరీక్షల్లో ఏదో రాసాము..ఇక డిగ్రీలో పాసైపోతాము అనుకుంటే పొరపాటే. డిగ్రీ విద్యావిధానంలో సమూల మార్పులు రాబోతున్నాయి. విద్యార్థి ఇకపై సిలబస్‌ను పూర్తిగా అర్థం చేసుకొని పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. సిలబస్‌లోని పరీక్షలే కాకుండా సిలబస్‌కు రిలేటెడ్‌గా ఉన్న ఇతర ప్రశ్నలను కూడా అడగనున్నారు. ఇప్పటి వరకు ఉన్న ప్రశ్నల ఛాయిస్‌ సిస్టంలోనూ మార్పులు తీసుకురానున్నారు. ఈ విధానం వచ్చే విద్యాసంవత్సరం 2023-24 నుంచి డిగ్రీలో అందుబాటులోకి రానుంది. ఇందుకుగానూ తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ), నిపా సంస్థలు పరీక్షా విధానంపై అధ్యయనం చేయనున్నాయి.

ప్రస్తుతం డిగ్రీలో కొనసాగుతున్న పరీక్షా విధానాలను ఐఎస్‌బీ ఇప్పటికే అధ్యయనం చేస్తోంది. వాటన్నింటిని పరిశీలించి సిలబస్‌ ఏవిధంగా ఉండాలి? పరీక్షల్లో మార్పులు, ప్రశ్నల సరళి ఎలా ఉండాలనే దానిపై సమగ్ర నివేదికను రూపొందించి తెలంగాణ ఉన్నత విద్యామండలికి వచ్చే ఏడాది 2023 ఏప్రిల్‌ 30 నాటికి అందజేయాల్సి ఉంటుంది. ఆతర్వాత దీన్ని డిగ్రీలో అందుబాటులోకి తేనున్నారు. ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు పొందినప్పుడు విద్యార్థులకు సబ్జెకట్‌ నాలెడ్జెతోపాటతు, ఇంగ్లీష్‌, తెలుగు, సంస్కృతం, హిందీ తదితర ఏదోక భాషపై మాట్లాడేలా లాంగ్వేజ్‌ ప్రాక్టికల్స్‌ కూడా నిర్వహించేలా మార్పులు తీసుకొస్తున్నారు.

- Advertisement -

దీనిపై తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశంలో మండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి, వైస్‌ ఛైర్మన్‌ ప్రొ.వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాస్రావు, కళాశాల విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, ఓయూ, కేయూ, ఎంజీయూ, పాలమూరు వీసీలు పాల్గొన్నారు. డిగ్రీ పాత విధానాన్ని స్వస్తి పలికి కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్లు మండలి ఛైర్మన్‌ లింబాద్రి తెలిపారు. అదేవిధంగా పరీక్షా పేపర్లు మూల్యాంకనంలోను సంస్కరణలు తీసుకొస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా డిగ్రీ పట్టాతో బయటికి వెళ్లే విద్యార్థికి సులువుగా ఉన్నత ఉద్యోగం దక్కేలా, ఉపాధి కల్పించే ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేసేలా నూతన పరీక్షా విధానాన్ని, సిలబస్‌ను, ఫ్యాకల్టిdని సన్నద్ధం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement