Wednesday, March 27, 2024

జోరూట్‌ మరో మైలురాయి

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జోరూట్‌ మరో మైలు రాయి అందుకున్నాడు. టెస్ట్‌లో పదివేల పరుగులు, 50కి పైగా వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా రూట్‌ రికార్డు సృష్టించాడు. ముల్తాన్‌ స్టేడియంలో పాకిస్థాన్‌ తో జరిగిన రెండో టెస్టులో అతను ఈ ఘనతను చేరువయ్యాడు. 70వ ఓవర్‌లో పాకిస్థాన్‌ బ్యాటర్‌ ఫహీం అష్రఫ్‌ను అవుట్‌ చేయడంలో రూట్‌ టెస్టుల్లో 50 వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఇప్పటి వరకూ దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌ రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌వా మాత్రమే టెస్టుల్లో 10 వేలకు పైగా పరుగులు, 50కి పైగా వికెట్లు తీశారు. టెస్ట్‌ల్లో జాక్వెస్‌ కలిస్‌ 13, 292 పరుగులు చేయడమే కాకుండా 292 వికెట్లు తీశాడు. స్టీవ్‌ వా ఖాతాలో 10,927 పరుగులు 92 వికెట్లు ఉన్నాయి. రూట్‌ టెస్టుల్లో 10, 629 పరుగులు స్కోర్‌ చేశాడు. అయితే కలిస్‌, స్టీవ్‌ వా రిటైర్‌ కావడంతో ఈ జాబితాలో రూట్‌ టాప్‌ ప్లేస్‌కు వెళ్లే అవకాశం ఉంది.


టెస్టుల్లో 10 వేల పరుగులు, 50 వికెట్లు , 150కి పైగా క్యాచ్‌లు పట్టిన రెండో ఆటగాడిగా రూట్‌ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. కలిస్‌ 200 క్యాచ్‌లతో మొదటి స్థానంలో ఉన్నాడు. రూట్‌ 166 క్యాచ్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. రెండో టెస్టులో ఇంగ్లండ్‌ 26 పరుగుల తేడాతో పాక్‌పై విజయం సాధించింది. మొదటి టెస్టులో కూడా నెగ్గిన ఇంగ్లండ్‌ మూడు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది. మూడో టెస్ట్‌ డిసెంబర్‌ 17న కరాచీలో జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement