Thursday, May 2, 2024

నేవీ జ‌వాన్ల‌తో స్వాతంత్య్ర వ‌జ్రోత్స‌వాల్లో పాల్గొన్న- స‌ల్మాన్ ఖాన్

షూటింగ్ గ్యాప్ లో స్వాతంత్య్ర వ‌జ్రోత్స‌వాల్లో పాల్గొన్నారు బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్. షూటింగ్‌ విరామాన్ని దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను జరుపుకునేందుకు కేటాయించారు. ప్రస్తుతం విశాఖలో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న సల్మాన్‌ ఖాన్‌.. విరామం ప్రకటించగానే నేవీ సిబ్బందితో గడిపారు. ఇండియన్‌ నేవీ తూర్పు కమాండ్‌ స్థావరమైన విశాఖపట్నంలోని నేవీ సిబ్బందితో కలిసి ఆడిపాడారు. దాదాపు ఐదారు గంటలు నౌకాదళ సిబ్బంది, వారి కుటుంబాలతో కలిసి ఎంజాయ్‌ చేశారు. నేవీ క్యాప్‌ ధరించిన సల్మాన్‌ ఖాన్‌.. త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని డ్యాన్సులు చేశారు.

ఫుష్‌ అప్‌లు చేస్తూ నేవీ జవాన్లను ఉత్సాహపరిచారు. వారిని కూడా చేయాలంటూ పోటీ పెట్టారు. అనంతరం అక్కడే కిచెన్‌లో వంట చేశారు. తనకు వంట చేయడం అంటే చాలా ఇష్టమని.. అంతే ఇష్టంగా కూడా తింటానంటూ చెప్తూ జవాన్లను నవ్వుల్లో ముంచెత్తారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ బిజీ నటుడు తమ వద్దకు వచ్చి టైమ్‌ కేటాయించి తమతో ఆడిపాడటం పట్ల నేవీ జవాన్లు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.ఇప్పుడు ఈ ఫొటోలు వైర‌ల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement