Saturday, May 4, 2024

ట్విట్టర్‌ సీఈఓగా పరాగ్‌ అగర్వాల్‌

ప్ర‌భ‌న్యూస్ : ట్విట్టర్‌ ఇంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూ టివ్‌ ఆఫీసర్‌ జాక్‌ డోర్సే పదవి నుంచి తప్పుకున్నారు. నవంబర్‌ 28న తన చివరి ట్వీట్‌లో ఐ లవ్‌ ట్విట్టర్‌ అని పేర్కొన్నారు. డోర్సే స్క్వేర్‌ అనే కంపెనీని స్థాపించాడు. దానికి కూడా ఆయనే సీఈఓగా ఉన్నారు. అటు ట్విట్టర్‌.. ఇటు స్క్వేర్‌కు సీఈఓగా విధులు నిర్వర్తించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2020 ప్రారంభంలోనే ట్విట్టర్‌ ఇంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పదవి నుంచి వైదొలగాలని ట్విట్టర్‌ వాటాదారు ఇలియట్‌ మేనేజ్‌మెంట్‌ కార్ప్‌ నుంచి ఒత్తిడి వచ్చింది. అయితే ఎందుకు వైదొలగాల్సి వచ్చిందో డోర్సే స్వయంగా వెల్ల డించలేదు.

అయితే కొత్త సీఈఓ ఎవరనే దానిపై డోర్సే స్పష్టత కూడా ఇవ్వడం విశేషం. పరాగ్‌ అగర్వాల్‌ ట్విట్టర్‌ నూతన సీఈఓగా కొనసాగుతారని వివరించారు. తాను ట్విట్టర్‌కు రాజీనామా చేశానని, ఈ విషయం ఎవరికైనా తెలుసో.. లేదో.. అ ని చెప్పుకొచ్చాడు. కానీ తాను మాత్రం రాజీనామా చేసినట్టు తెలిపాడు. 16 ఏళ్ల పాటు కీలక పదవుల్లో సేవలు అందించినట్టు వివరించాడు. సీఈఓ బాధ్యతలు అప్పగించినందుకు పరాగ్‌ అగర్వాల్‌ ధన్యవాదాలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement