Sunday, April 28, 2024

ఉలిక్కిప‌డ్డ బెంగ‌ళూరు.. భారీ శ‌బ్దాల‌తో ఆందోళ‌న‌

ప్ర‌భ‌న్యూస్: బెంగ‌ళూరు మ‌రోసారి భారీ శ‌బ్దాల‌తో ఉలిక్కిప‌డింది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఒక్క‌సారిగా ఈ శ‌బ్దాలు వినిపించాయి. బెంగ‌ళూరుతో పాటు మాండ్యా, రామ‌న‌గ‌ర జిల్లాల్లోనూ ఈ శ‌బ్దాలు వినిపించాయి. భూకంపం సంభ‌వించిందంటూ.. ప‌లువురు సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెట్టారు. లేదు లేదు.. సూప‌ర్ సోనిక్ సంకేతాలు అంటూ మ‌రికొంద‌రు చెప్పుకొచ్చారు. బెంగ‌ళూరులోని రాజ‌రాజేశ్వ‌రీ న‌గ‌రంలో కూడా భారీ శ‌బ్దం వినిపించింది.

దీనిపై ప్ర‌కృతి విప‌త్తుల విభాగం స్పందించింది. ఎటువంటి భూకంపాలు సంభ‌వించ‌లేద‌న్నారు. సెసిమిక్ అబ్జ‌ర్వేట‌రీ ద్వారా ఇది స్ప‌ష్ట‌మైంద‌న్నారు. ఈ శ‌బ్దాల‌కు, భూ ప్ర‌కంప‌న‌ల‌కు సంబంధం లేద‌ని క‌ర్నాట‌క రాష్ర్ట ప్ర‌కృతి విప‌త్తు ప‌ర్య‌వేక్ష‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఇలాంటి శ‌బ్దాలు వినిపించ‌డం ఇది కొత్త కాదు.. ఈ ఏడాది జులైలోనూ బెంగ‌ళూరు న‌గ‌రాన్ని ఈ వింత శ‌బ్దాలు స్థానికుల కంటిపై నిద్ర లేకుండా చేసింది. యుద్ధ విమానం టేకాఫ్ కార‌ణంగానే ఈ శ‌బ్దం వ‌చ్చిన‌ట్టు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్ప‌ష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement