Monday, May 6, 2024

పాకిస్తాన్ ప్రధానికి కొవిడ్‌ పాజిటివ్‌

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలిందని పాక్‌ సమాచార శాఖ మంత్రి మరియం ఔరంగజేబ్ మంగళవారం ట్విట్టర్‌లో రాశారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ రెండు రోజులుగా అస్వస్థతతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో వైద్యుల సలహా మేరకు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఇందులో క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ప్రధాని త్వరగా కోలుకోవాలని ప్రజలు, కార్మికులు ప్రార్థించాలని ట్విట‌ర్ వేదిక‌గా ఔరంగజేబ్ అభ్యర్థించారు. ఆయనకు కొవిడ్‌ సోకడం ఇది మూడోసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement