Saturday, May 18, 2024

ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న – జ‌య‌మ్మ పంచాయితీ

యాంక‌ర్ సుమ న‌టించిన చిత్రం జ‌య‌మ్మ పంచాయితీ. త‌న యాంక‌రింగ్‌, ప్రాసలు, పంచ్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా అల‌రిస్తుంటుంది. ఇటీవ‌లే ‘జ‌యమ్మ పంచాయితీ’ చిత్రంతో వెండితెర‌పై అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. విజ‌య్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మే 6న విడుద‌లై యావ‌రేజ్‌గా నిలిచింది. పోటీగా ‘అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం’, ‘భ‌ళా తంద‌నాన’ సినిమాలు ఉండ‌టంతో బ్రేక్ ఈవెన్ సాధించ‌లేక‌పోయింది. కానీ సుమ న‌ట‌నకు మంచి మార్కులే ప‌డ్డాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్ 14 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దేవి ప్ర‌సాద్, షాలినీ కొండెపూడి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి ఎమ్‌.ఎమ్ కీర‌వాణి సంగీతం అందించాడు. వెన్నెల క్రియేష‌న్స్ ప‌తాకంపై బ‌ల‌గ ప్ర‌కాష్ నిర్మించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement