Friday, April 26, 2024

ఆయూష్‌ పీజీ వైద్యసీట్ల భర్తీకి 8,9వ తేదిల్లో వన్‌టైం వెబ్‌ఆప్షన్లు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: రాష్ట్రంలోని ఆయూష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్లకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పీజీ ఆయుర్వేదం, హోమియో, యూనానీ కోర్సులో కన్వీనర్‌ కోటా సీట్లను ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్ధులు నమోదు చేసిన ఇట్టి వన్‌టైం ఆప్షన్ల ద్వారా అన్ని విడుదల కౌన్సెలింగ్‌లకు సీట్ల కేటాయింపులు జరపనున్నారు.

- Advertisement -

అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో ఈనెల 8వ తేదిన ఉదయం 9 గంటల నుంచి 9వ తేదిన సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని, యూనివర్సిటీ వర్గాలు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement