Monday, May 29, 2023

ఔను … వాళ్ల ముగ్గురు ఒక‌ట‌య్యారు…..

చర్ల, ప్రభన్యూస్‌ : తెలుగు సినిమా కథలను తలదన్నేలా ఒక వరుడు ఇద్దరు వధువులను ఒకే ముహూర్తాన వివాహం చేసుకున్న వైనం మారుమూల అటవీ గ్రామమైన ఎర్రబోరులో జరిగింది.మండల పరిధిలోని ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి సత్తిబాబు (24)కు డిగ్రీ చదివే రోజులలో దోసిల్లపల్లి గ్రామానికి చెందిన సోడి స్వప్న కుమారి(19)తో పరిచయం ఏర్పడి, పరిచయం కాస్త ప్రేమగా మారి, ఇద్దరి మధ్య శారీరక బంధం ఏర్పడింది.ఈ క్రమంలో స్వప్నకుమారి ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. తదనంతరం జరిగిన పరిణామములో సత్తిబాబు స్వప్న కుమారి విడివిడిగా జీవనం సాగిస్తున్నారు. అనంతరం సత్తిబాబుకు తమ సమీప బంధువైన కుర్నపల్లి గ్రామానికి చెందిన ఇర్పా సునీ(19)తో ప్రేమలో పడ్డాడు , శారీరక బంధం బలపడడంతో సునీత సైతం ఒక బాబుకు జన్మనిచ్చింది. కుర్నపల్లికి చెందిన సునీత తల్లిదండ్రులు ఇర్పా సత్యనారాయణ, రుక్మిణి దంపతులు తమ కుమార్తెకు జరిగిన అన్యాయంపై గిరిజన పెద్దలను ఆశ్రయిం చారు.

- Advertisement -
   

పెద్దలు వీరిద్దరి వివాహానికి అంగీకారం తెలపడంతో, విషయం కాస్త ఆ నోట ఈ నోట స్వప్న కుమారి తల్లిదండ్రులైన సోడి వెంకటేశ్వర్లు,సమ్మక్క దంపతుల చెవిలో పడటంతో దోసిల్లపల్లి గ్రామస్తులు ఎర్రబోరు గ్రామానికి చెందిన గిరిజన పెద్దలను ఆశ్రయించడంతో తెలుగు సినిమా కథను తలదన్నేలా మూడు కుటు-ంబాలకు చెందిన పెద్దలతో మాట్లాడి గురువారం ఉదయం 7-04 నిమిషాలకు వివాహం జరిపేలా పెళ్లి నిశ్చయించారు.వివాహానికి సంబంధించిన పెళ్లి ఆహ్వాన పత్రిక బంధువులకు పంచే క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా గత నాలుగు రోజులుగా హల్‌ చల్‌ చేసింది. తమ పెళ్లి గురించి వివిధ మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న విషయాన్ని తెలుసుకున్న వరుడు, వధువుల కుటు-ంబాలకు చెందిన పెద్దలు,గిరిజన పెద్దలు, ప్రభుత్వానికి చెందిన అధికారులు పెళ్లిని ఎక్కడ నిలుపుదల చేస్తారోననే భయంతో గురువారం ఉదయం జరగవలసిన పెళ్లిని బుధవారం రాత్రి 9 గంటల నుండి 10 మధ్యలో గిరిజన సాంప్రదాయాల మధ్య ముగించారు.ఈ పెళ్లికి వివిధ గ్రామాలకు చెందిన గిరిజనులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement