Thursday, April 25, 2024

అన్నమయ్య కీర్తనలు : ఇన్నిరాసుల

ఇన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీరాశి కూటమి గలిగిన రాశి

కలికిబొమవిండ్లు గల కాంతకును ధనురాశి
మెలయు మీనాక్షికిని మీనరాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
చెలగు హరిమధ్యకును సింహరాశి

చిన్ని మకరాంకపు య్యెదచేడెకు మకరరాశి
కన్నెప్రాయపు సతికి కన్నెరాశి
వెన్నెయై పైడితలు తూగు వనితకు తులారాశి
తిన్నది వాడి గోళ్ళ సతికి వృశ్చికరాశి

ఆముకొను నొరపుపు మెరయు న తివకు వృషభరాశి
గామిడి గుట్టు మాటలసతి కర్కాటకరాశి
కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి
ప్రేమ వేంకటపతి గలసె ప్రియ మిధునపురాశి

Advertisement

తాజా వార్తలు

Advertisement