Tuesday, April 30, 2024

మ‌రోసారి ఫాంట‌సీ ప్ర‌పంచంలోకి .. భైరవద్వీపం రీ-రిలీజ్ డేట్ ఫిక్స్

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ తన సినీ కెరీర్ ప్రారంభ దశ నుండే పెద్ద ఎత్తున‌ అభిమానులను సొంతం చేసుకున్నాడు. తీవ్రమైన యాక్షన్- డ్రామాతో నిండిన సినిమాలే కాకుండా బహుముఖ కథలను ఎంచుకుని ప్రయోగాలు చేస్తుండ‌టంలో ఎప్పుడూ వెనుకాడలేదు. అలా ఆయ‌న చేసిన సినిమాల్లో జానపద కథలు, సైన్స్ ఫిక్షన్, ఆదిత్య 369 వంటి విభిన్నమైన సినిమాలు ఉన్నాయి. అలాంటి వాటిలోనే ప్రేక్షకులు నేటికీ ఇష్టపడే సినిమా భైరవ ద్వీపం. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు ద‌ర్శ‌క‌త్వంలో 1994లో రిలీజ్ అయిన ఈ హై ఫాంటసీ జానపద కథా చిత్రంలో నందమూరి బాలకృష్ణ, రోజా ప్రధాన పాత్రలు పోషించారు.

కాగా, బాక్సాఫీస్ బరిలో వసూళ్ల సునామీతో అద్భుతాలను సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు మ‌రో సారి భారీ స్క్రీన్‌లపై రానుంది. ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ సినిమాను ఈ తరం ప్రేక్షకుల కోసం 4K రిజల్యూషన్‌లో బిగ్ స్క్రీన్‌లపై ఆగస్టు 5న రీ-రిలీజ్ చేసేందుకు క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్లాన్ చేసింది.

ఈ సినిమాని చందమామ విజయ కంబైన్స్ పతాకంపై బి. వెంకట రామి రెడ్డి నిర్మించారు. అంతే కాకుండి ఈ సినిమా తొమ్మిది నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఇక‌ ఈ మూవీలో కైకాల సత్యనారాయణ, విజయ కుమార్, రంభ, విజయ రంగరాజు, శుభలేఖ సుధాకర్, గిరిబాబు, బాబు మోహన్, మిక్కిలినేని, పద్మనాభం, సుత్తివేలు, కోవై సరళ, చిట్టి బాబు, కె.ఆర్. విజయ, మనోరమ, సంగీత, రజిత, కోవై సరళ ముఖ్య పాత్ర‌లు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement