Thursday, May 2, 2024

ఈ-వేహికిల్స్‌ నిలిపేసిన ఓలా.. డిమాండ్‌ తక్కువ, సప్లయ్‌ ఎక్కువ‌..

ప్రముఖ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ తయారీ సంస్థ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్రం హోనూరు జిల్లా కృష్ణ గిరిలో ఉన్న తయారీ ప్లాంట్‌లో ఓలా తయారీ కార్యకలాపాల్ని నిలిపి వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్‌ నిలిపివేతపై ఓలా ప్రతినిధుల్ని వివరణ కోరగా వెహికిల్స్‌ తయారీ కోసం కొత్త మెషిన్‌లను ఇన్‌స్టాల్‌ కోసం గతవారం రోజుల నుంచి ప్రొడక్షన్‌ నిలిపి వేసినట్లు తెలిపారు. కానీ ప్రొడక్షన్‌ను షట్‌ డౌన్‌ చేయడానికి ఇతర కారణాలున్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి.

సత్తా ఉన్న ఓలా సీఈవో..

తన ఇన్నోవేటివ్‌ మార్కెటింగ్‌ స్ట్రాటజీతో అమ్మకాలు జరిపే సత్తా ఉన్న ఓలా సీఈవో భవిష్‌ అగర్వాల్‌. కానీ ఓలా అమ్మకాల్లో తన అంచనాలు తల క్రిందులైనట్లు తెలుస్తోంది. సమ్మర్‌ సీజన్‌లో ఆ సంస్థ తయారుచేసిన వెహికిల్స్‌లోని బ్యాటరీలు హీటెక్కి కాలిపోవడం, నాసిరకం మెటీరియల్‌తో వెహికిల్స్‌ తయారుచేయడం, చిన్నపాటి రోడ్డు ప్రమాదాలకే ఆ వెహికిల్‌ టైర్‌ ఊడిపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఓలా ఈవీ వెహికిల్స్‌ కొనుగోలు చేయాలనుకున్న కొనుగోలు దారులు సైతం వెనక్కి తగ్గారు. దీంతో తయారీ ఉత్పత్తి పెరిగిపోయి.. కొనుగోలు డిమాండ్‌ తగ్గింది.

స్టాక్‌ పేరుకుపోతుంది..

తమిళనాడులో ప్యూచర్‌ ఫ్యాక్టరీ పేరుతో ఓలా ప్లాంట్‌లో సుమారు 4 వేలకు పైగా ఈవీ వెహికిల్స్‌ అమ్ముడుపోక స్టాక్‌ అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. జులై 22 నుంచి రోజుకు 600 వెహికిల్స్‌ తయారీ సామర్ధ్యం ఉన్న ప్లాంట్‌లో కేవలం రోజుకు 100 వెహికిల్స్‌ ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. కానీ ఇటీవలికాలంలో ఓలా ఎస్‌1 ప్రోను కొనుగోలు చేసిన వాహనదారులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.

- Advertisement -

కారణాలు లేవు..

ఓలా వెహికిల్స్‌ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఓలా ఎస్‌ 1 ప్రోను కొన్న అశోక్‌ బైద్‌ అనే వాహనదారుడు స్పందించారు. నేను గత నెలలో ఓలా ఎస్‌ 1 ప్రోను కొనుగోలు చేశా. ఇప్పటివరకు నేను ఎలాంటి సమస్య ఎదుర్కోలేదు. సంస్థ వెహికిల్స్‌ను విడుదల చేసిన ప్రారంభంలో సమస్యలు ఎదురైన మాట వాస్తవమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆటో మొబైల్‌ సంస్థలు వార్షిక నిర్వహణకు అనుగుణంగా కార్యకలాపాల్ని నిర్వహిస్తుంటాయి. మేం కూడా అదే చేస్తున్నాం. ఓలా ప్రొడక్షన్‌ ఎందుకు షట్‌ డౌన్‌ చేశారనే విషయంలో ఇతర కారణాలు ఏవీ లేవని ఓలా స్పోక్‌ పర్సన్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement